ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా ఇక్కడ బలాబలాలు సాగుతున్నాయి. త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ ఆధిక్యం దిశగా పయనిస్తుండగా, మేఘాలయాలో మాత్రం హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల ఎర్లీ ట్రెండ్స్ చూస్తుంటే ఇప్పటికి బీజేపీ పై చేయి కనిపిస్తోంది. కాగా ఇక్కడ ప్రాంతీయ పార్టీలు కాస్త గట్టిగానే పోటీ ఇస్తున్నాయి. నాగాలాండ్ లో బీజేపీ కూటమి దూసుకుపోతోంది. త్రిపురలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతున్నట్టు ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. మేఘలయాలో మాత్రం నువ్వా నేనా అన్నట్టు హంగ్ దిశగానే ఫలితాలు సాగుతున్నట్టు ప్రస్తుతానికి అర్థమవుతోంది. ఇక ఈశాన్య రాష్ట్రాలపై ఎలాగైనా పూర్తీ రాజకీయ పైచేయి సాధించేలా బీజేపీ మోడీ హయాంలో సర్వం ఒడ్డుతోంది. అస్సోం సీఎం హిమంతా బిశ్వా శర్మ ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో బలమైన దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికను అనుసరిస్తోంది మోడీ-షా ద్వయం. కాగా తరచూ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తూ, ఎన్నికల ప్రచారాల్లో సైతం మోడీ కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు.
BJP leading: త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ హవా, మేఘాలయాలో హంగ్?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES