Thursday, December 12, 2024
Homeచిత్ర ప్రభThe girl friend teaser: రశ్మిక కొత్త మూవీ టీజర్ లాంచ్ చేసిన విజయ్...

The girl friend teaser: రశ్మిక కొత్త మూవీ టీజర్ లాంచ్ చేసిన విజయ్ దేవరకొండ

రశ్మిక కొత్త సినిమా

హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ రిలీజ్

- Advertisement -

రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఈ రోజు “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

విజయ్ దేవరకొండ స్పందిస్తూ – “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ లోని ప్రతి విజువల్ ఆకట్టుకుంది. ఈ మూవీని చూసేందుకు వెయిట్ చేస్తున్నా. 8 ఏళ్ల క్రిితం రశ్మికను సెట్ లో కలిశా. ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నా రశ్మిక వ్యక్తిగతంగా ఇప్పటికే అంతే హంబుల్ గా ఉంది. నటిగా ఆమెకు “ది గర్ల్ ఫ్రెండ్” మరింత బాధ్యతను ఇచ్చింది. సక్సెస్ ఫుల్ గా రశ్మిక ఆ బాధ్యత వహిస్తుందని ఆశిస్తున్నా. ప్రతి ప్రేక్షకుడినీ కదిలించే మంచి కథను ఈ సినిమాతో డైరెక్టర్ రాహుల్ చూపిస్తాడని నమ్ముతున్నా. “ది గర్ల్ ఫ్రెండ్” టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.

“ది గర్ల్ ఫ్రెండ్” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – కాలేజ్ హాస్టల్ లోకి రశ్మిక అడుగుపెడుతున్న సీన్ తో టీజర్ మొదలైంది. హీరో దీక్షిత్ శెట్టి, రశ్మిక క్యారెక్టర్స్ పరిచయం, వారి మధ్య బ్యూటిఫుల్ రిలేషన్ ను చూపించారు. ఆ కాలేజ్ లో లీడ్ పెయిర్ చేసిన జర్నీ ఎంతో ఎమోషనల్ గా ఉంది. ‘నయనం నయనం కలిసే తరుణం, ఎదనం పరుగే పెరిగే వేగం..’ అంటూ విజయ్ దేవరకొండ ఇచ్చిన వాయిస్ ఆకర్షణగా నిలుస్తోంది. ‘రేయి లోలోతుల సితార..’ అనే పాట బీజీఎం, ‘ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా.. అస్సలు పడను’ అంటూ రశ్మిక టీజర్ చివరలో చెప్పిన డైలాగ్ ఆకట్టుకున్నాయి.

వైవిధ్యమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News