అదానీ కుంభకోణంపై దేశరాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అదానీ గ్రూప్ కంపెనీల ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది అత్యున్నత ధర్మాసనం. నిపుణుల ప్యానెల్ ఏర్పాటు చేసిన అత్యున్నత న్యాయస్థానం సీల్డ్ కవర్ లో సంపూర్ణ నివేదికను 2 నెలల్లోగా సమర్పించాలని ఆదేశించింది.
- Advertisement -
ప్రస్తుతం సెబీ చేపట్టిన దర్యాప్తును 2 నెలల్లోగా పూర్తి చేసి కోర్టుకు సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆదేశించారు. ఈలోగా స్టేటస్ రిపోర్టును ఫైల్ చేయాల్సిందే సెబీను సుప్రీం ఆదేశించింది.