శ్రీ నీల కంటేశ్వర స్వామి జాతర సందర్భంగా మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న బీవీ స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ హోరా హోరీ గా సాగుతుంది.
సోమవారం స్థానిక వీవర్స్ కాలని గ్రౌండ్ లో 5 వ రోజు క్రికెట్ పోటీలు లో హైటెక్ లెవన్ వర్సెస్ ఎంసి లేవెన్ జట్ల మధ్య జరిగింది. హైటెక్ లెవెన్ జట్టు క్రీడాకారుడు 15 బంతుల్లో 39 పరుగులు సాధించి ప్రతిభను చాటాడు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎమ్మిగనూరు కో ఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్ గట్టు అల్తాఫ్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం జరిగింది.
కార్యక్రమంలో బీవీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు ఈ రంగస్వామి గౌడ్, శంకర్ గౌడ్, సురేష్ చౌదరి, టిడిపి పట్టణ సోషల్ మీడియా కన్వీనర్ మన్సూర్ బాషా పాల్గొన్నారు.