Thursday, December 12, 2024
Homeఆంధ్రప్రదేశ్Teacher's MLC: టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన బొర్రా గోపీ మూర్తి

Teacher’s MLC: టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన బొర్రా గోపీ మూర్తి

రాష్ట్ర శాసన మండలి, తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజక వర్గ ఎన్నికలో అభ్యర్థి బొర్రా గోపీ మూర్తి అవసరమైన కోటాకు మించి ఓట్లు సాధించి ఎమ్మెల్సీగా ఎన్నికైయ్యారు. సోమవారం స్థానిక జెఎన్టియూ కాకినాడ ప్రాంగణలోని డా.బిఆర్ అంబేత్కర్ లైబ్రరీ గ్రౌండ్ ప్లోర్ లో ఈ ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎన్నికల పరిశీలకులు కె.హర్షవర్దన్, రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా ఎస్పి విక్రాంత్ పాటిల్, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో నిర్వహించారు.

- Advertisement -

14 టేబుళ్లపై ఉదయం 8 గంటలకు ప్రారంభించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మద్యాహ్నం 1 గంటకే పూర్తయింది. ఈ ఎన్నికలో మొత్తం పోలైన 15,494 ఓట్ల లెక్కింపులో 814 చెల్లని ఓట్లు పోనూ మిగిలిన 14,680 వాలిడ్ ఓట్లలో బొర్రా గోపీమూర్తి కి 9,165 ఓట్లు తొలి రౌండ్ లోనే లభించాయి.

ఈ ఎన్నికలో పోటీ చేసిన ఇతర అభ్యర్థులు గంధం నారాయణరావు కు 5,259, దీపక్ పులుగు కు 102, నామన వెంకట లక్ష్మి (విళ్ల లక్ష్మి) కి 81, డా.నాగేశ్వరరావు కవల కు 73 ఓట్లు లభించాయి. వాలిడ్ ఓట్ల ఆధారంగా నిర్థేశించిన కోటా ఓట్ల సంఖ్య 7,341 కాగా, వీటికి మించి బొర్రా గోపీ మూర్తికి తొలి రౌండ్ డిలైల్డ్ కౌంటింగ్ లోనే 9,165 ఓట్లు లభించడంతో, ఎన్నికల కమీషన్ ఆమోదంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్, కాకినాడ ఆయనను(బొర్రా గోపీమూర్తి) ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ప్రకటించి, ధృవపత్రాన్ని అందజేశారు.

నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి మీడియాతో మాట్లాడుతూ తన పట్ల అపార అభిమానం, నమ్మకంతో తనను ఎమ్మెల్సీగా గెలిపించిన ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసారు.  దేశ ప్రగతిలో విద్యారంగ ప్రాత్ర అత్యంత కీలకమైనదని,  ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యలపై  రాష్ట్ర శాసన మండలిలో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలియజేసారు.  వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు  నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ గోపీమూర్తికి అభినందనలు తెలియజేశారు. 
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News