Tuesday, December 24, 2024
Homeతెలంగాణపదేళ్లు తెలంగాణ తల్లి వివక్షకు గురైంది

పదేళ్లు తెలంగాణ తల్లి వివక్షకు గురైంది

సామాన్య మహిళగా..

తెలంగాణ తల్లి పదేళ్లు వివక్షకు గురైందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి.. ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారని సీఎం ఆరోపించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని మంత్రులతో చర్చించి విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

- Advertisement -

సోమవారం సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని మంత్రులతో కలసి సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యమ కాలంలో వివిధ రాజకీయ పార్టీలు తెలంగాణ తల్లికి వివిధ రూపాలు ఇచ్చారన్నారు. కానీ, ఇప్పటివరకు తెలంగాణ తల్లి రూపాన్ని అధికారికంగా ప్రకటించలేదు.అందుకే ప్రజా ప్రభుత్వం బహుజనుల తల్లి రూపమే తెలంగాణ తల్లి రూపంగా అధికారికంగా ప్రకటించిందని చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అవహేళనకు గురైంది
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసిన డిసెంబర్‌ 9 చరిత్రలో నిలిచిపోతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఎన్నో ఏళ్లు అవహేళనకు గురైందన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న రోజుల్లో అందరం ‘టీజీ’ అని రాసుకున్నామని చెప్పారు. కానీ, గత ప్రభుత్వం మాత్రం ‘టీజీ’ అక్షరాలు కాదని, టీఎస్‌ అని పెట్టి ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని మండిపడ్డారు.

సర్వం కోల్పోయిన కవులని ఆదుకుంటాం
తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన కవులను గుర్తించి, గౌరవించాలని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరి రావులను ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు. వీరందికి ప్యూచర్‌ సిటీలో 300 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.కోటి నగదు, తామరపత్రం అందిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News