హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రి(Continental Hospitals)లో చికిత్స పొందుతున్న మంచు మోహన్ బాబు(Mohan Babu) ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆసుపత్రిలో చేరే సమయంలో హైబీపీతో బాధపడుతున్నారని తెలిపారు. దీంతో వివిధ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు.
- Advertisement -
కుడి కంటి కింద వాపు ఉందని.. ఇంటర్నల్ గాయాలు అయ్యాయన్నారు. సిటీ స్కాన్ చేయాల్సి ఉందని.. ఆయనకు అవసరమైన ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. తన పక్కన ఏం జరుగుతుందోనన్న విషయం కూడా ఆయనకు అర్థం కావడం లేదన్నారు. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని వైద్యులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాల్సిన అవసం ఉందరని వెల్లడించారు.