2024 మరో 20 రోజుల్లో ముగియనుంది. ఇప్పటివరకు ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. వీటిలో కొన్ని నిరాశపర్చగా.. మరికొన్ని అద్భుమైన విజయాలు అందుకున్నాయి. తాజాగా ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ(IMDB) 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 25 మధ్య విడుదలైన సినిమాల్లో IMDB రేటింగ్ ఆధారంగా ఈ లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ తొలి స్థానంలో నిలిచింది.
ఈ జాబితాలో ఉన్న టాప్ 10 సినిమాలు ఇవే..
కల్కి 2898 ఏడీ
స్త్రీ2
మహరాజ్
షైతాన్
ఫైటర్
మంజుమ్మల్ బాయ్స్
భూల్ భూలయ్య 3
కిల్
సింగమ్ అగైన్
లాపతా లేడీస్
ఇదిలా ఉంటే 2024లో గూగుల్‌లో దేశవ్యాప్తంగా ఎక్కువమంది వెతికిన చిత్రాల జాబితాలో ప్రభాస్ నటించిన రెండు సినిమాలు ఉండటం విశేషం. ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’ (Salaar) సినిమాల కోసం ప్రేక్షకులు సెర్చ్ చేసినట్లు గూగుల్ తెలిపింది.