మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్(Collectors Meeting)లో మాట్లాడిన ఆయన.. సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇసుక విధానాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చూస్తున్నారని.. కానీ అలా కాకుండా ఎవరైనా అందులో కలుగజేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ ప్రభుత్వం మంచి చేయడానికే ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉన్నా కానీ పరిపాలన విషయంలో గాడి తప్పకూడదని కలెక్టర్లకు సూచించారు. ప్రజలు తమను విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని.. తమ నుంచి వారు చాలా ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే పాలసీలను తాము చేయగలమని వాటిని ప్రజలకు చేరువ అయ్యేలా చేసేది అధికారులే అని తెలిపారు.
గత ప్రభుత్వం రూ.10లక్షల కోట్ల అప్పు చేసిందని.. ఇవి చూస్తుంటే ఒక్కోసారి ఏపీ కూడా శ్రీలంకలా మారిపోతుందేమో అనిపించిందన్నారు. వారసత్వంగా అప్పులతో వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలంటే.. అందరూ కలిసి పని చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని స్మగ్లింగ్ అనే భూతం పట్టి పీడిస్తోందని.. ఈ విషయంలో విజిలెన్స్ అధికారులు (Vigilance Officers) నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక నుంచి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పవన్ వార్నింగ్ ఇచ్చారు.