Thursday, December 12, 2024
Homeచిత్ర ప్రభThirumala: సూపర్ స్టార్ రజినీకాంత్ కు రాధిక విషెస్ తెలిపిన

Thirumala: సూపర్ స్టార్ రజినీకాంత్ కు రాధిక విషెస్ తెలిపిన

తలైవా..హ్యాపీ బర్త్ డే

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటి రాధిక శరత్ కుమార్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతర రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.

- Advertisement -

ఆలయం వెలుపల రాధిక శరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు ఎలాంటి బాధలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News