Thursday, September 19, 2024
Homeనేషనల్Amazon : అమెజాన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఆ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నాం

Amazon : అమెజాన్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ఆ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నాం

Amazon : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. త‌న ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంను మూసివేయ‌నున్న‌ట్లు తెలిపింది. భార‌త దేశంలో హైస్కూల్ విద్యార్థుల కోసం ఈ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. అయితే.. ఎటువంటి కార‌ణం చెప్ప‌కుండానే మూసివేస్తున్న‌ట్లు తెలిపింది.

- Advertisement -

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో గ‌తేడాది అమెజాన్ అకాడ‌మీ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ ప్లాట్‌ఫాం వేదిక‌గా జేఈఈ వంటి పోటీ ప‌రీక్ష‌ల‌కు కోచింగ్ అందిస్తోంది. అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న త‌రువాత‌నే దీన్ని మూసివేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని ప్ర‌క‌టించింది. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న వినియోగ‌దారుల‌ను దృష్టిలో ఉంచుకుని ద‌శ‌ల వారీగా ఈ నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి అదుపులోనే ఉండ‌డంతో విద్యాసంస్థ‌లు అన్ని య‌థావిధిగా ప‌ని చేస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్ విద్య‌ను అందిస్తున్న సంస్థ‌లు పున‌రాలోచ‌న‌లో ప‌డ్డాయి. 2500 మంది ఉద్యోగుల‌ను తొలగించ‌నున్న‌ట్లు బైజూస్ చెప్పిన సంగ‌తి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News