ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం : సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్
రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు నేను, నా మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నాం. ఈ ఆరు నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దాం. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం. ‘రాష్ట్రమే ఫస్ట్…ప్రజలే ఫైనల్’ అనే నినాదంతో ప్రతిక్షణం ప్రజలకు మంచి చేసేందుకు పనిచేస్తున్నాం. చేయాల్సింది ఎంతో ఉందనే బాధ్యతను గుర్తెరిగి…ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. మీ ఆశీస్సులు, భాగస్వామ్యంతో…స్వర్ణాంధ్ర – 2047 విజన్ తో ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 గా నిలబెడతాం.