Keerthy Suresh| హీరోయిన్ కీర్తి సురేశ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యుల సమక్షంలో ప్రియుడు ఆంటోనీ ఆమె మెడలో మూడు ముళ్లు వేశారు. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి వివాహం వేడుకగా జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు.
దాదాపు 15 సంవత్సరాల పాటు తాము మంచి స్నేహితులమని ఇటీవల కీర్తి సురేశ్ ఆమె ప్రియుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసి తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా చెన్నైకు చెందిన ఆంటోనీ ఇంజనీరంగ్ పూర్తి చేసి గల్ఫ్ కంట్రీ ఖతార్‌లో జాబ్ చేశారు. అనంతరం ఇండియాకు తిరిగి వచ్చి చెన్నై, కేరళలో వ్యాపారాలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన ఆస్తి రూ.300కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.