అనారోగ్యంతో గత రెండు రోజులుగా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు మోహన్ బాబు(Mohan Babu)ను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. రిపోర్టులన్ని నార్మల్‌గానే ఉన్నాయని వెల్లడించారు. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో ఆయన ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనకు బీపీ ఎక్కువగా ఉందని.. గుండె కొట్టుకోవడంలో హెచ్చుతగ్గులు ఉన్నాయని తెలిపారు. అలాగే కుడి కంటి దిగువభాగంలో గాయమైనట్లు గుర్తించామన్నారు.
- Advertisement -
మరోవైపు విచారణకు హాజరుకావాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈనెల 24వరకు స్టే ఇచ్చింది.