Thursday, December 12, 2024
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడి మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Chandrababu: మంత్రి కొల్లు రవీంద్ర సోదరుడి మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు కొల్లు వెంకటరమణ(64) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొల్లు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

మరోవైపు వెంకటరమణ మృతి పట్ల టీడీపీ నేతలు కూడా సంతాపం తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వారి స్వగృహం నందు రమణ భౌతిక కాయానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, తదితర నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News