Sunday, January 5, 2025
HomeతెలంగాణSangareddy: తెలంగాణలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఏపీ నుంచి ముంబైకి..

Sangareddy: తెలంగాణలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఏపీ నుంచి ముంబైకి..

తెలంగాణలో మరోసారి భారీగా డ్రగ్స్(Drugs) పట్టుబడ్డాయి. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో డ్రగ్స్ తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు. ఓ లారీలో డ్రగ్స్‌ తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో డీఆర్‌ఐ, నార్కొటిక్‌ డ్రగ్స్‌ కంట్రోల్‌, సెంట్రల్‌ విజిలెన్స్‌ అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్ తరలిస్తున్న లారీని ఆపగా.. డ్రైవర్‌, క్లీనర్‌ పరారయ్యారు. లారీని చిరాగ్‌పల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం. ఈ మాదక ద్రవ్యాలను ఏపీలోని కాకినాడ పోర్టు(Kakinada Port) నుంచి ముంబై తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

- Advertisement -

కాగా కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఇటీవల సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) బియ్యం స్మగ్లింగ్‌ చేస్తున్న షిప్‌ అడ్డుకుని సీజ్ చేయించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రేషన్ బియ్యమే కాకుండా డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్ కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ఇప్పుడు అదే పోర్టు నుంచి లారీలో డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News