అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, అల్లు అర్జున్ ను స్టేషన్ తీసుకెళ్తున్నారు.
- Advertisement -
పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై దాఖలైన కేసులు విచారిస్తున్న చిక్కడపల్లి పోలీసులు తదుపరి చర్యలు తీసుకోబోయే చర్యలేంటనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ కేసును సీరియస్ గా, ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు తెలంగాణ పోలీసులు. డ్రగ్స్, సినిమాల విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తోంది.
సంధ్యా థియేటర్ యజమాని ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా, ఈరోజు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అయ్యారు.
తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి కేసులో ఏ1 గా ఉన్నారు బన్నీ.