ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన్ను అరెస్ట్ చేసిన FIR కాపీ ఇప్పుడు బయటకు వచ్చింది. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ప్రత్యక్ష సాక్షి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్‌పై FIR నమోదు చేశారు పోలీసులు.
- Advertisement -
మరోవైపు అల్లు అర్జున్ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. ఆయన రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు. వైద్య పరీక్షల కోసం గాంధీ హాస్పిటల్‌కు అల్లు అర్జున్ను తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దీంతో గాంధీ ఆసుపత్రి, కోర్టు వద్దకు బన్నీ ఫ్యాన్స్ భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.