BRS| అల్లు అర్జున్(Allu Arjun) అరెస్టును బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత పగే అల్లు అర్జున్ అరెస్టుకు కారణమంటూ ఓ వీడియోను వైరల్ చేస్తున్నారు. పుష్ప2 సక్సెస్ మీట్‌లో బన్నీ మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మర్చిపోయిన విషయం తెలిసిందే. దీంతో రేవంత్ పేరు బన్నీ మర్చిపోయినందుకు ఇప్పుడు అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గౌరవప్రదమైన సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇలా వ్యక్తిగత పగలకు దిగడం ఎందుకని మండిపడుతున్నారు.
మరోవైపు బన్నీ అరెస్టుపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో #AlluArjunarrest హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. అసలేం జరిగింది..? ఎందుకు బన్నీని అరెస్ట్ చేశారనే దానిపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈమేరకు పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.