దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా రేపటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉంది. ఇది డిసెంబర్ 15 నాటికి అల్పపీడనంగా మారి, ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉంది.
- Advertisement -
దీని ప్రభావంతో సోమవారం ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంగళవారం కోస్తా,రాయలసీమలో విస్తారంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
~ రోణంకి కూర్మనాథ్ , మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.