Mohan Babu| నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. జర్నలిస్టుపై దాడి ఘటనలో తనపై నమోదైన హత్యాయత్నం కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.
- Advertisement -
కాగా ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మోహన్ బాబు పిటిషన్ వేశారు. అయితే మోహన్ బాబు అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. అయితే హత్యాయత్నం కేసు కావడంతో పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం తెలుస్తోంది.