Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభBIG Breaking: అల్లు అర్జున్‌కు రిమాండ్

BIG Breaking: అల్లు అర్జున్‌కు రిమాండ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)కు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజలు పాటు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో అల్లు అర్జున్‌ను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. దీంతో ఆ రూట్‌లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ రావడంతోనే సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిందని పోలీసులు కోర్టుకు నివేదించారు. దీంతో పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బన్నీకి రిమాండ్ విధించారు.

- Advertisement -

మరోవైపు బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేశారని వివరించారు. అయితే ఈ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందినట్లు బన్నీకి తెలియదని.. గతంలోనూ బెనిఫిట్ షోలకు బన్నీ హాజరయ్యారని తెలిపారు. బన్నీకి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిందని అల్లు అర్జున్ తరపు న్యాయవాది న్యాయమూర్తి దృష్టికి తీసుకురాగా.. రిమాండ్ విధించలేదని జీపీ వాదించారు. మొత్తానికి హైకోర్టు తీర్పు వచ్చాకే నాంపల్లి కోర్టు రిమాండ్‌పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News