నాగాల్యాండ్ కు తొలి మహిళా ఎమ్మెల్యే ఎన్నికవ్వటం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో హైలైట్. లాయర్, ఉద్యమకర్తగా చురుకుగా పనిచేస్తున్న 48 ఏళ్ల హెకాని జఖలు అనే మహిళా అభ్యర్థి బీజేపీ కూటమికి చెందిన ఎన్డీపీపీ టికెట్ పై పోటీ చేసి డిమాపూర్ -3 నుంచి విజయం సాధించారు. 60 ఏళ్ల క్రితం రాష్ట్రంగా ఏర్పడ్డ నాగాలాండ్ లో ఇప్పటివరకూ ఏ మహిళనూ ఎమ్మెల్యేగా గెలవకపోవటం శోచనీయం. మొత్తం 183 మంది అభ్యర్థుల్లో నలుగురు మహిళా అభ్యర్థులు ఈసారి ఎన్నికల్లో ఇక్కడ బరిలోకి దిగారు. నాగాలాండ్ లో బీజేపీ కూటమి అయిన బీజేపీ, ఎన్డీపీపీ అధికారం చేపట్టనున్నాయి. చీఫ్ మినిస్టర్ నిఫ్యూ రియో ఆధ్వర్యంలోని ప్రాంతీయ పార్టీ అయిన నేషనలిస్ట్ డెమాక్రటిక్ ప్రొగ్రెస్సివ్ పార్టీ ఈసారి మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇవ్వటం విశేషం.
60 ఏళ్లలో ఫస్ట్ వుమెన్ ఎమ్మెల్యే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES