Sunday, January 5, 2025
Homeఆంధ్రప్రదేశ్Kg tomato Rs 8: 8 రూపాయలకే కేజీ టమోటా

Kg tomato Rs 8: 8 రూపాయలకే కేజీ టమోటా

ఏపీలో..

రాష్ట్ర‌వ్యాప్తంగా కిలో టమాటా రూ.8/- కి ప్ర‌భుత్వం విక్ర‌యించ‌నుంది. కర్నూలు పత్తికొండ మార్కెట్ యార్డులో కొనుగోలు చేసి లాభ నష్టాలు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్లలో ఆ ధరకు విక్రయించాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి, తక్కువ ధరకు వర్షాధార నాసిరకం టమాటా మార్కెట్లో అందుబాటులో ఉండడంతో సాధారణ టమాటా ధరపై ప్రభావం పడిందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అటు రైతులకు ఇటు వినియోగదారులకు మేలు జరిగే విధంగా మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోళ్లు విక్రయాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ట‌మాటా ధ‌ర ప‌డిపోయిన నేప‌థ్యంలో అటు రైతులు, ఇటు వినియోగ‌దారుల‌కు మేలు చేకూరేలా ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు తీసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News