Allu Arjun: శుక్రవారం ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన అల్లు అర్జున్ ఎపిసోడ్ ఎట్టకేలకు సుఖాంతం అయింది. నాంపల్లి కోర్టు 14 రోజలు రిమాండ్ విధించినా.. తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంత బెయిల్ ఇవ్వడంతో బన్నీకి బిగ్ రిలీఫ్ దక్కింది.
బన్నీ అరెస్ట్ నుంచి బెయిల్ వరకు ఇలా..
ఉదయం 11:45 నిమిషాలకు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు
మధ్యాహ్నం 12 గంటలకు అరెస్టు చేస్తున్నామని అల్లు అర్జున్‌కు చెప్పిన పోలీసులు
మధ్యాహ్నం 12:15 గంటలకు అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన పోలీసులు
మధ్యాహ్నం 12:20 గంటలకు జూబ్లీహిల్స్ నివాసం నుంచి అల్లు అర్జున్ తరలింపు
మధ్యాహ్నం 1 గంటలకు చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్ తరలింపు
మధ్యాహ్నం 1:15 గంటలకు రిమాండ్ రిపోర్టు రెడీ చేసిన పోలీసులు
మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ ఆస్పత్రికి అల్లు అర్జున్
మధ్యాహ్నం 2.15 గంటలకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు మొదలు
మధ్యాహ్నం 3 గంటలకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి
మధ్యాహ్నం 3.16 గంటలకు నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్
సాయంత్రం 5 గంటలకు రిమాండ్ విధించిన కోర్టు
సాయంత్రం 5.30 గంటలకు చంచల్ గూడ జైలుకు తరలింపు
సాయంత్రం 5.40 గంటలకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్