తెలంగాణలో అత్యంత వేగవంతంగా విస్తరిస్తున్న సంస్థ సెల్‌బే షావోమి వారి సరికొత్త 5G హ్యాండ్సెట్ రెడ్‌మీ నోట్ 14 సిరీస్ ను టాలీవుడ్ సింగర్ మంగ్లీ చేతుల మీదుగా లాంచ్ చేసారు.
ఈ సందర్బంగా సింగర్ మంగ్లీ మాట్లాడుతూ తెలంగాణలో అత్యంత నమ్మకమైన సంస్థ సెల్‌బే వారి షోరూమ్ లో రెడ్‌మీ నోట్ 14 సిరీస్ లాంచ్ చెయ్యడం చాలా సంతోషంగా ఉందీ అన్నారు. ఉత్తమమైన ప్రొడక్ట్స్, సర్వీసెస్ అందిస్తున్న సెల్‌బే మానేజ్మెంట్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
సెల్‌బే ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ సోమా నాగరాజు మాట్లాడుతూ, తమ సంస్థ ఎల్లప్పుడూ తమ కస్టమర్స్ కు సరికొత్త ప్రొడక్ట్స్ అందిస్తుందని అందులో భాగంగా రెడ్‌మీ నోట్14 సిరీస్ లాంచ్ చేశామన్నారు.
సుహాస్ నల్లచెరు, డైరెక్టర్ స్ట్రాటజీ & ప్లానింగ్, సెల్‌బే మాట్లాడుతూ రెడ్‌మీ నోట్14 ప్రారంభ ధర కేవలం Rs 18,999/- ఉంటుందని చెప్పారు, ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నారు. సుదీప్ నల్లచెరు, డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ సెల్‌బే మాట్లాడుతూ నిరంతరం మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా తమ మార్కెటింగ్ స్ట్రాటజీలను మలుచుకుంటూ సరికొత్త షాపింగ్ అనుభూతిని అందిస్తున్నామన్నారు. రెడ్‌మీ నోట్ 14 సిరీస్ హ్యాండ్‌సెట్లు తమ అన్ని సెల్‌బే స్టోర్ లలో ఈరోజు నుండి లభిస్తుందని, ఈ సరికొత్త ఫోన్ క్వాడ్ కర్వ్డ్ ఆమోల్డ్ (AMOLED) డిస్‌ప్లే & IP 68 వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయని చెప్పారు.