Sunday, December 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu: జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

జమిలి ఎన్నికల(Jamili Elections)పై ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జమిలి ఎన్నికలు అమల్లోకి వచ్చినా.. 2029లోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ పార్టీ మద్దతు ప్రకటించామని తెలిపారు. వైసీపీ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి త్వరలోనే ఎన్నికలు వస్తాయని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని పేర్కొన్నారు. వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు.

- Advertisement -

రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌ను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని వ్యాఖ్యానించారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని సూచించారు. 1996 నాటి పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకూ కనిపిస్తున్నాయని వెల్లడించారు. 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కాగా సోమవారం పార్లమెంట్‌లో జమిలి ఎన్నికల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News