లోక్‌సభ(Loksabha)లో ప్రవేశపెట్టాలనుకున్న జమిలి ఎన్నికల బిల్లుల(Jamili elections)పై కేంద్రం వెనకడుగు వేసినట్లు సమాచారం. తాజాగా లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి ఇందుకు సంబంధించిన రెండు బిల్లులను తొలగించారు. తొలుత ఈ నెల 16న లోక్‌సభ ముందుకు బిల్లులు తీసుకురావడానికి బిజినెస్ జాబితాలో బిల్లులను లిస్ట్ చేశారు. ఈ బిల్లులను కేంద్ర మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ప్రవేశ పెడతారని కేంద్రం పేర్కొంది.
- Advertisement -
అయితే తాజాగా రివైజ్డ్ చేసిన లోక్‌సభ బిజినెస్ జాబితాలో జమిలి ఎన్నికల బిల్లులకు చోటు దక్కలేదు. ఈ నెల 20తో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. దీంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లో జమిలి బిల్లులుప్రవేశపెట్టడం కష్టమే అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .