Wednesday, December 18, 2024
HomeతెలంగాణBalakrishna: కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. ఇంటి స్థలం కోల్పోనున్న బాలకృష్ణ

Balakrishna: కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. ఇంటి స్థలం కోల్పోనున్న బాలకృష్ణ

Balakrishna: కేబీఆర్‌ పార్కు(KBR Park) రోడ్డు విస్తరణ పనుల్లో తెలంగాణ ప్రభుత్వం స్పీడ్ పెంచింది. జూబ్లీహిల్స్‌ మహారాజ అగ్రసేన్‌ కూడలి నుంచి చెక్‌పోస్టు వరకు కేబీఆర్‌ పార్కు హద్దు పొడవునా రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయడంతో పలువురు ప్రముఖులు తన ఇంటి స్థలాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ, మాజీ మంత్రి జానారెడ్డి, అల్లు అర్జున్‌ మామ కె.చంద్రశేఖర్‌రెడ్డి, రెండు మీడియా సంస్థల యజమానులు, పలువురు బడా వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే వీరికి నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.

- Advertisement -

కేబీఆర్‌ పార్కు జాతీయ ఉద్యానవనం కావడంతో హద్దు పొడవునా కొంత భూమి ‘ఎకో సెన్సిటివ్‌ జోన్‌’గా ఉంటుంది. దీంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం డిజైన్లను మార్చి ఎకో సెన్సిటివ్‌ జోన్‌ను తాకకుండా నిర్మాణాలన్నింటినీ రోడ్డు వైపున చేపట్టాలని నిర్ణయించింది. అవసరమైన చోట ప్రైవేటు ఆస్తులను సేకరించాలని నిర్ణయించింది. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి, మహారాజ అగ్రసేన్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 45, చెక్‌పోస్టు, కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు కూడళ్లలో రూ.1,200 కోట్లతో ఏడు ఉక్కు వంతెనలు, ఆరు అండర్‌పాస్‌లను నిర్మించనునంది. దీంతో బాలకృష్ణ ఇల్లు రోడ్డు నం.45, 92 కూడలి వద్ద ఉండటంతో రెండు వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉండటంతో దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News