Venu Swamy: సెలబ్రెటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామి..తాజాగా మరో సెలబ్రెటీ జాతకం చెప్పి హాట్ టాపిక్‌గా మారారు. నాగచైతన్య-సమంత విడిపోతారంటూ చెప్పిన వేణుస్వామి.. నిజంగానే వారిద్దరు విడిపోవడంతో ఓవర్ నైట్ పాపులర్ అయ్యారు. ఇక అప్పటి నుంచి సెలబ్రెటీల జాతకాలు చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. అయితే ఆయన చెప్పిన విషయాలు చాలా కాంట్రావర్సీ అయ్యాయి.
2023 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుంది.. కేటీఆర్(KTR) సీఎం అవుతారని తెలిపారు. అలాగే ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని.. ప్రభాస్ కెరీర్ ముగిసిపోతుందని.. 2024 ఏపీ ఎన్నికల్లో జగన్(Jagan) మరోసారి సీఎం అవుతారని చెప్పుకొచ్చారు. అయితే ఇవేమీ జరగకపోవడంతో విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇదే సమయంలో నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం చేసుకున్న వెంటనే వారిద్దరు విడిపోతారంటూ వేణు స్వామి చెప్పడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా సైలెంట్ అయిన వేణుస్వామి మళ్లీ వార్తల్లోకి వచ్చారు.
ఈసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ఝ(Allu Arjun) జాతకంతో ముందుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ ఏకంగా సీఎం అవుతారంటూ బాంబ్ పేల్చారు. త్వరలోనే కొత్త పార్టీ పెడతారని.. జైలుకు వెళ్లిన వారంతా సీఎంలు అయ్యారు కాబట్టి.. బన్నీ కూడా సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ప్రస్తుతం వేణుస్వామి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ విషయం ట్రెండింగ్ అవుతుంది కాబట్టి పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి మరోసారి తన వ్యాఖ్యలతో వేణుస్వామి వార్తల్లో నిలిచారు.