కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)లపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రత్యేక దృష్టి సారించారు. అటు రాజధాని నిర్మాణ పనులతో పాటు ఇటు పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పర్యటను శ్రీకారం చుట్టారు. రేపు(సోమవారం) జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu)తో కలిసి ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు.
అనంతరం జనవరి 2 నుంచి ప్రారంభమయ్యే డయాఫ్రం వాల్ పనులపై ఇంజనీరింగ్ విభాగం అధికారులతో భేటీ కానున్నారు. తదుపరి ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. కాగా పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.15 వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2027 కల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు పోలవరం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.