స్వగ్రామం శివపల్లి నుండి ప్రేరణ పొందిన బాలుసాని మణిదీప్, చిన్న వయస్సులోనే సామాజిక సేవకు అంకితమై, తెలంగాణ రాష్ట్రంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ నాయకుడిగా ఎదిగాడు. 20 ఏళ్ల బాలుసాని మణిదిప్ 21వ ఏట అడుగుపెట్టి, టిడిఎస్ఎ (తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ఎన్నికై తన నాయకత్వంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
విద్యాభ్యాసం:
బాలుసాని మణిదీప్ విద్యాభ్యాసం సుల్తానాబాద్ లోని సెయింట్ మేరిస్ పాఠశాలలో 5వ తరగతి వరకు జరిగింది. అనంతరం కరీంనగర్ లోని విద్యాధరిలో 9వ తరగతి వరకు చదివి, 10వ తరగతి సుల్తానాబాద్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ ను ఆల్ఫోర్స్ కాలేజీలో అభ్యసించారు.
సామాజిక సేవ:
2020 నుండి సామాజిక సేవలో పాల్గొంటున్న బాలుసాని, 2021లో సెక్రటరీగా ఎన్నికయ్యాడు. 2022లో తిరుమల డెంటల్ కాలేజీలో చేరి డెంటల్ గ్రాడ్యుయేషన్ ప్రారంభించాడు. ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐడీఎస్‌ఎ)లో చేరి, 2022 అక్టోబరులో జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. 2023లో టీడిఎస్ఎలో వైస్ ప్రెసిడెంట్ గా నియమితుడయ్యాడు.
విశేష అవార్డులు
2023 జూలైలో వేక్ అప్ తెలంగాణ అవార్డు అందుకున్న బాలుసాని, 2024లో తన వర్గంతో కలిసి తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (టిడిఎస్ఎ) స్థాపించి, 2024లో మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన నిర్వహించిన ఉచిత డెంటల్ క్యాంపులు పెద్దగా ప్రాచుర్యం పొందాయి. తొలిసారి ఇండియన్ పబ్లిక స్కూల్ లో నిర్వహించిన క్యాంపులో 1800 విద్యార్థులకు మరియు 1000 మందికి పైగా ప్రజలకు ఉచిత దంత వైద్యం అందించారు.
సేవలు
ఆయన డిజిటల్ డెంటల్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల్లో దంత వైద్యంపై మరింత అవగాహన పెంచారు. 2023 అక్టోబర్ లో, అంబేద్కర్ రత్నం సేవా పురస్కారం కూడా పొందారు. త్వరలో గ్రామీణ ప్రాంత ప్రజల కోసం టీడిఎస్ఎ ద్వారా దంత సేవ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ విద్యార్థి నాయకుడిగా మణిదీప్ పాపులర్ అయ్యారు.