PV Sindhu: ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఈనెల 22న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో తన స్నేహితుడు వెంకట దత్తసాయితో సింధు వివాహం ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో పలువురు ప్రముఖులను తన వివాహానికి హాజరుకావాలని సింధు ఆహ్వానిస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను ఆహ్వానించారు. మంగళగిరిలోని పవన్ కార్యాలయానికి తన తండ్రి పి.వి రమణతో కలిసి వెళ్లి శుభలేఖను అందజేశారు.
కాగా శనివారం పీవీ సింధు నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింధును చేసుకోబోయే వెంకట దత్తసాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ట్రిఫుల్ ఐటీ బెంగళూరులో డేటా సైన్స్ చదివారు. ఆయన తండ్రి హైడరాబాద్‌లోని ప్రముఖ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.