Thursday, December 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Rajya Sabha: రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన కూటమి సభ్యులు

Rajya Sabha: రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన కూటమి సభ్యులు

Rajya Sabha: ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుచుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ సభ్యుల రాజీనామాతో ఇటీవల ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన విషయం విధితమే. మొత్తం మూడు స్థానాలకు బీద మస్తాన్‌ రావు, ఆర్‌.కృష్ణయ్య, సానా సతీష్‌‌లు నామినేషన్లు దాఖలు చేయగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో ఈ ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సభ చైర్మన్ జగదీప్ దన్‍ఖడ్ వీరి చేత ప్రమాణం చేయించారు.

- Advertisement -

కాగా బీద మస్తాన్‌ రావు, సానా సతీశ్ టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వగా.. ఆర్‌.కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు సభ్యులతో ఎన్డీయే కూటమికి రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ లభించనుంది. దీంతో కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చే కీలక బిల్లులకు ఆమోదం సులభం కానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News