Thursday, December 19, 2024
HomeతెలంగాణSeethakka: హరీష్‌ రావుకు మంత్రి సీతక్క కౌంటర్.. బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్

Seethakka: హరీష్‌ రావుకు మంత్రి సీతక్క కౌంటర్.. బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్

Seethakka: సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్‌ రావు(Haris Rao) వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నాయకులు పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్ చేశారని మండిపడ్డారు. తొలిసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 2014 సంవత్సరం నుంచే సర్పంచ్‌ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తుచేశారు.

- Advertisement -

మరి ఆ బిల్లులను గత ప్రభుత్వం ఎందుకు చెల్లించలేదో సమాధానం చెప్పాలన్నారు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన హరీష్‌ రావుకు సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల గురించి తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడేమో తమకేం తెలియదన్నట్లుగా ఈ విషయంపై మాట్లాడటం హస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకపోవడంతోనే.. బిల్లులు పెండింగ్‌లో పడ్డాయని తెలిపారు. అయితే మంత్రి సీతక్క సరైన సమాధానం ఇవ్వలేదంటూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

కాగా అంతకుముందు హరీష్ రావు మాట్లాడుతూ.. ఏడాది కాలంగా సర్పంచ్‌లకు చెల్లించాల్సిన రూ.691 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం బడా కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లిస్తోందని ఫైర్ అయ్యారు. ఒక్క నవంబర్ నెలలోనే బడా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం రూ.1,200 కోట్ల బిల్లులు చెల్లిచిందని తెలిపారు .పంచాయతీ ఎన్నికల లోపు సర్పంచులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News