SS Rajamouli: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తనలో ఉన్న మరో టాలెంట్‌ను బయటకు తీశారు. ఇన్ని సంవత్సరాలు తనకు దర్శకత్వమే వచ్చానుకుంటున్న అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. తనలో డ్యాన్స్ టాలెంట్ కూడా ఉందని నిరూపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహ పెళ్లి యూఏఈలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో రాజమౌళి వేసిన డ్యాన్స్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘వెంకీ’ సినిమాలో గోంగూర తోట పాటకు తన సతీమణి రమాతో కలిసి స్టెప్పులు అదరగొట్టిన జక్కన్న.. ‘దేవర’ మూవీలోని ఆయుధ పూజ పాటకు కూడా డ్యాన్స్ ఇరగదీశారు. సింగర్ కాలభైరవతో కలిసి మంచి హుషారుగా స్టెప్పులేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో జక్కన్నలో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇరగదీశారు డ్యాన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తీయనున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. ఇందులో మహేష్‌ను హాలీవుడ్ హీరో రేంజ్‌లో చూపించనున్నట్లు టాక్.