Uttam Kumar Reddy: తెలంగాణలో కొత్త రేషన్ కార్టులపై(Ration Cards) మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. సమగ్ర విచారణ జరిపి అవసరం లేని వారి కార్డులను తొలగించి అసలైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. కులగణన సర్వే ఆధారంగా లబ్దిదారుల ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగతున్నట్లు గుర్తించామన్నారు. అందుకే ప్రజలకు సన్న బియ్యాన్ని అందజేయాలని చూస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో రేషన్ బియ్యం పంపిణీ, వినియోగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్లు ఉత్తమ్ వెల్లడించారు.