Telangana Assembly: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అసెంబ్లీలోని ఇన్నర్ లాబీలోకి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు అనుమతి లేదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే మీడియాపై కూడా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధించారు. సభ్యులు, ఇతరుల ఫోటోలు, వీడియోలు కూడా తీయొద్దని స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆదేశాలు జారీచేశారు.

అయితే స్పీకర్ నిర్ణయంపై మాజీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ఆంక్షలు చూడలేదని మంండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన ప్రజా ఆమోదయోగ్యంగా లేదని విమర్శలు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ప్రాంగణంలో వివిధ పార్టీలు చేపట్టే నిరసల్లో మాజీ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారని.. అందుకే ఆంక్షలు విధించామని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు.