Ilayaraja: దిగ్గజ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజాకు ఆలయంలో అవమానం జరిగింది. తమిళనాడులోని శ్రీ విల్లిపుత్తూరులో ఉన్న ఆండాళ్ దేవాలయంలోని గర్భగుడికి వెళ్లిన ఇళయరాజాను అక్కడున్న పూజారులు అడ్డుకుని బయటకు పంపించారు. అంతకుముందు ఆలయానికి వచ్చిన ఇళయరాజకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పెరియ పెరుమాళ్ గుడి, నందనవనం, ఆండాళ్‌ను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా గర్భగుడిలోకి ఎదురుగా ఉన్న అర్థ మండపంలోకి ప్రవేశించేందుకు ఆయన ప్రయత్నించగా.. అనుమతి లేదని అర్చకులు, జీయర్లు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇళయరాజాను అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నో పాటల్లో స్వామి వారిని కీర్తించిన సంగీత విద్వాంసుడికి ఇదేనా ఇచ్చే గౌరవం అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ ఘటనపై ఆండాళ్ ఆలయ కార్యనిర్వహణాధికారి వివరణ ఇచ్చారు. గర్భగుడి ఎదుట ఉన్న అర్థ మండపంలో ఉత్సవ విగ్రహాలను శాశ్వతంగా ఉన్నందున జీయర్లకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నారు. అయితే ఇళయరాజా అర్థ మండపంలోకి తెలియకుండా రావడంతో లోపలకి ఎవరినీ అనుమతించబోమని చెప్పడంతో ఆయన బయట నిలబడి స్వామి దర్శనం చేసుకున్నారని పేర్కొన్నారు.