భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 11:20 గంటలకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 12.05 గంటలకు మంగళగిరి ఎయిమ్స్ చేరుకోనున్నారు. మధ్యాహ్నం 1:15 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎంబీబీఎస్ తొలి బ్యాచ్ విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్(Abdul Nazeer), సీఎం చంద్రబాబు(CM Chandrababu), కేంద్రమంత్రి ప్రతాపరావు జాదవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ బయల్దేరి వెళ్లనున్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు.