Wednesday, December 18, 2024
Homeఫీచర్స్K party in Royal British style: రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె...

K party in Royal British style: రాయల్ బ్రిటిష్ స్టైల్ థీమ్‌తో కె పార్టీ ఫ్యాషన్ షో

ఫ్యాషన్ పెరేడ్

హైదరాబాదులో ప్రతి సంవత్సరం కొత్త కొత్త థీమ్‌ లతో జరుగుతున్న కె స్టైల్ పార్టీ ఈ సంవత్సరం కూడా అత్యంత ఆసక్తి చూపారు, కె పార్టీ ప్రియులకు తన కొత్త ఆలోచనతో లయన్ డాక్టర్ కిరణ్, సుచిరిండియా గ్రూప్ సీఈఓ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు బల్గేరియా గౌరవ కన్సల్, తన ప్రతిష్టాత్మక కె పార్టీని రాయల్ బ్రిటిష్ స్టైల్లో ఘనంగా నగరంలో నిర్వహించారు. ఈ అద్భుత వేడుక, ఫ్యాషన్ షోతో పాటు సొగసుతో కూడిన వినోదానికి అందించారు. ఈ కార్యక్రమంలో సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

డాక్టర్ కిరణ్, తన ప్రత్యేకత మరోమారు నిరూపించారు. చాలా వినూత్నంగా ఆలోచించి సరికొత్త థీమ్-సర్‌ప్రైజ్‌లు ఈ ఈవెంట్‌ను మరిచిపోలేని ఓ గొప్ప అనుభూతిగా మార్చేలా చేసాయి.

మొత్తానికి ఈ ఈవెంట్ తో కె పార్టీ మరోసారి హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. వచ్చే సంవత్సరం కె పార్టీ మరో ఎడిషన్ కోసం అవసరమైన ఆసక్తి ఇప్పటికే మొదలైందన్నమాట. తన సృజనాత్మకత, వినూత్నతకు ప్రసిద్ధుడైన లయన్ కిరణ్, మరొక విశిష్టమైన, ఉత్సాహభరితమైన థీమ్‌తో అందరినీ సర్ప్రైజ్ చేశారు.

వచ్చే సంవత్సరంలో లయన్ కిరణ్ తన పార్టీ ప్రియుల కోసం మరోమారు ఇంకో కొత్త థీమ్ తో ముందుకు వస్తారనే డిస్కషన్ ఫ్యాషన్ లవర్స్ లో క్రేజీగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News