Wednesday, December 18, 2024
HomeతెలంగాణTelangana Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. పలు కీలక బిల్లులకు ఆమోదం

Telangana Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. పలు కీలక బిల్లులకు ఆమోదం

రాష్ట్ర సచివాలయంలో జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం రెండు గంటలకు పైగా సాగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రైతు భరోసా(Rythu Bharosa)పై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో సంకాంత్రి పండుగ నుంచి రైతులకు భరోసా నిధులు అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.

- Advertisement -

అలాగే కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై సుదీర్ఘంగా చర్చించారు. ఓఆర్ఆర్(ORR) పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీల్లో విలీనానికి ఆమోదం తెలిపారు. మొత్తంగా ఐదు ఆర్డినెన్స్‌ బిల్లులకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News