ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule). భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. కేవలం 10 రోజుల్లోనే రూ.1292కోట్లు వసూలు చేసింది.
తాజాగా 11 రోజుల కలెక్షన్స్‌కు సంబంధించి మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. 11 రోజుల్లోనే రూ.1409 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. కేవలం నిన్న(ఆదివారం) ఒక్కరోజే రూ.117 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. దీంతో 2024లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాసర్‌గా ‘పుష్ప2’ నిలిచిందన్నారు.
కాగా ‘బాహుబలి2′(రూ.1810కోట్లు) కలెక్షనను బ్రేక్ చేయడానికి మరో రూ.401 కోట్లు మాత్రమే అవసరం. దీంతో ప్రభాస్ రికార్డును అల్లు అర్జున్ బద్ధలు కొట్టి చరిత్ర సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.