Wednesday, December 18, 2024
HomeతెలంగాణTelangana High Court: ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట

Telangana High Court: ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టులో ఊరట

రాష్ట్రంలో చదువుతున్న ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్(BDS) విద్యార్థులకు తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) ఊరట లభించింది. తెలంగాణ స్థానిక‌త ఉండి ఇత‌ర రాష్ట్రాల్లో చ‌దివినా.. స్థానిక‌త లేకుండా తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ చ‌దివిన వారిని కూడా స్థానికులుగా ప‌రిగ‌ణించాల‌ని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో 140 సవరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- Advertisement -

కాగా జీవో 140 ప్ర‌కారం 6 నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు తెలంగాణ‌లో చ‌ద‌వ‌డంతో పాటు ఎంబీబీఎస్ కూడా ఇక్క‌డే పూర్తి చేసిన వారికి తెలంగాణ స్థానికత క‌ల్పిస్తారు. అయితే ఈ జీవోని మెడికల్ పీజీ విద్యార్థులు హైకోర్టులో స‌వాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్ర‌భుత్వం తెచ్చిన జీవోని స‌వ‌ర‌ణ చేయాల‌ని సూచించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News