నంద్యాల జిల్లా డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి(Kotla SuryaPrakash Reddy) అస్వస్థతకు గురయ్యారు. ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనను హుటాహుటిన కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.
- Advertisement -
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. సూర్యప్రకాష్ రెడ్డి అస్వస్థతకు గురికావడంతో అనుచరులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.