Wednesday, December 18, 2024
Homeచిత్ర ప్రభRRR Documentary: RRR డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల

RRR Documentary: RRR డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల

ఇండియన్ సినీ ఇండస్ట్రీతో పాటు హాలీవుడ్ ఇండస్ట్రీని సైతం మెప్పించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రామ్ చరణ్‌(Ram Charan), ఎన్టీఆర్(NTR) హీరోలుగా నటించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డు, ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి సినిమా షూటింగ్‌లో జరిగిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకునేందుకు మూవీ యూనిట్ ఓ డాక్యుమెంటరీ రూపొందించింది.

- Advertisement -

‘ఆర్‌ఆర్‌ఆర్‌: బిహైండ్‌ అండ్‌ బియాండ్‌’ (RRR: Behind & Beyond) పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. అలాగే ఈనెల 20న ఎంపిక చేసిన పలు థియేటర్లలోనూ దీనిని రిలీజ్ చేయనుంది.

కాగా ఈ సినిమా రూ.1200కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. మూవీలోని నాటు నాటు పాట అయితే ఓ ఊపు ఊపేసింది. ఈ పాటకు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా రావడం విశేషం. ఇందులో చెర్రీ, తారక్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక జక్కన డైరెక్షన్‌కు అయితే హాలీవుడ్ ప్రముఖులు కూడా సెల్యూట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News