హైదరాబాద్ పోలీసుల ఆదేశాలతో నటుడు మోహన్ బాబు(Mohan Babu)తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్‌ను తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీసులకు సరెండర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో గన్ కూడా పోలీసులకు సరెండర్ చేశారు. ఈ గన్‌ను ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. దీంతో ఆయన దగ్గరున్న రెండు గన్‌లు పోలీసులకు డిపాజిట్ చేసినట్లైంది.
- Advertisement -
కాగా మంచు కుటుంబం వివాదం నేపథ్యం్లో జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు అరెస్టుపై రాచకొండ సీపీ సుధీర్ బాబు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విధిమతే. ఆయన అరెస్టుపై ఎలాంటి ఆలస్యం లేదని హైకోర్టు ఈనెల 24 వరకు మినహాయింపు ఇవ్వడంతో వేచి చూస్తున్నామని వివరణ ఇచ్చారు. గడువు ముగిసిన తర్వాత విచారణకు హాజరు కాకపోతే తప్పకుండా అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.