కొలిమిగుండ్లలో రెడ్డి వెంగన్న బావిలో పారిశుధ్య పనులు పూర్తి చేసినట్లు సర్పంచి జినుగు శివరాముడు తెలిపారు. వంద సంవత్సరాల క్రితం గ్రామస్తుల దాహార్తి తీర్చడానికి రెడ్డి వెంగన్న అనే దాత నిర్మించిన ఈ రెడ్డి వెంగన్న బావిలో కాలక్రమేనా చెత్త చెదారం చేరి, అలాగే పిచ్చి మొక్కలు పెరిగి అపరిశుభ్రంగా ఉండింది. అయితే బావిలో పుష్కలంగా నీళ్లు ఉండడం, గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచి జినుగు శివరాముడు గత ఐదు రోజులుగా ఈ బావిలో పారిశుధ్య పనులు చేపట్టారు. పారిశుధ్య పనులు పూర్తిగా ముగిశాయి. అపరిశుభ్రంగా ఉన్న బావి పరిసరాలు, మెట్లు, బావి నీటిలో ఉన్న చెత్తాచెదారం శుభ్రం చేయడంతో బావి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.
పూర్వపు నీటిని కూడా మోటార్లతో బయటికి పంపింగ్ చేసి, పూడిక తీసి, బావిని బావిలోని నీటిని వినియోగంలోకి తీసుకొస్తామని సర్పంచ్ జీనుగు శివరాముడు తెలిపారు. కొన్నేళ్లుగా చెత్తాచెదారంతో కూడుకొని అపరిశుభ్రంగా ఉన్న బావిని పరిశుభ్రతగా చేసి, తిరిగి వినియోగంలోనికి బావిని తీసుకురావడంలో కృషి చేసిన సర్పంచి జినుగు శివ రాముని గ్రామస్తులు అభినందించారు.