Wednesday, December 18, 2024
HomeతెలంగాణGarla: గ్రామపంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్

Garla: గ్రామపంచాయతీ సిబ్బంది ముందస్తు అరెస్ట్

అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని తెలంగాణ గ్రామ పంచాయతీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ్ల అప్పి రెడ్డి గార్ల మండల అధ్యక్షులు పెరుమర్తి దాసులు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ కు బయలుదేరనున్న గార్ల మండల కేంద్రంలోనిగ్రామపంచాయతీ కార్మికులను మంగళవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ కొరకు ముందస్తు అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు చలో హైదరాబాదుకు వెళ్లనున్న గ్రామపంచాయతీ యూనియన్ నాయకులను సిబ్బందిని ఇలా నిర్బంధాలు అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు, ఇచ్చిన హామీలను పరిష్కరించాలని లేకపోతే పోరాటాలు ఉదృతంగా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది నరేష్ కిరణ్ ప్రేమ్ చంద్ అనసూర్య కొండమ్మ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News