ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చాలని కోరుతూ ఖాకీ దుస్తులు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) తెలంగాణ అసెంబ్లీకి(Telangana Assembly) ఆటోల్లో వచ్చారు. కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao) సహా ఎమ్మెల్యేలంతా ఆటో డ్రైవర్ల యూనిఫాం వేసుకున్నారు. ఆటో కార్మికులను ఆదుకోవాలంటూ ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు.
కేటీఆర్ స్వయంగా ఆటో నడిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తామన్న 12వేల రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఆటో డ్రైవర్లు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. బీఆర్ఎస్ పక్షాన వారికోసం పోరాడతామని స్పష్టం చేశారు. కాగా మంగళవారం నల్ల చొక్కాలు, బేడీలతో అసెంబ్లీకి వచ్చిన సంగతి తెలిసిందే.